నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~ రాయచోటి :- టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేస్తూ తీసుకుందన్న కథనాలపై ఎంతో బాధేస్తా ఉందని ఇలాంటి నిర్ణయం కూటమి మదిలో ఏనాడు రాకూడదని కానీ ఒక్కసారి మదిలోకి వస్తే వాళ్ల మనసులు మారవని ఆ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యులు సీనియర్ నేత ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాదేస్తోంది. చంద్రబాబు నాయుడు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనకి తగ్గరు. అన్నమయ్య జిల్లా వాసుల కోసం ఒకసారి చంద్రబాబు యోచించి అడుగులు వేస్తే బాగుంటుంది. అన్నమయ్య జిల్లాను విభజించొద్దు. అలాగే ఉండనీయండి. ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోకపోతే అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నియోజకవర్గాన్ని కడప జిల్లాలో విలీనం చేయాలని మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. భౌగోళికంగా రాయచోటి నియోజక వర్గం కడప జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉందని మదనపల్లె జిల్లా కేంద్రానికి పోవాలంటే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని ఆయన తెలిపారు. రైల్వే కోడూరు నియోజక వర్గ ప్రజల అభీష్టం మేరకు వారిని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని రాజంపేట నియోజక ప్రజల అభీష్టం మేరకు ఆ ప్రాంత వాసుల కోరిక మేరకు వాళ్లను కడప జిల్లాలోకి విలీనం చేయాలని అలా చేస్తే రాయచోటి వాసులు ఎంతో హర్షిస్తారని ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. మదనపల్లె జిల్లా కేంద్రం చేయడంతో పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజక ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాయచోటి నియోజక వర్గ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని మా నియోజక వర్గ ప్రజల అభీష్టం మేరకు అన్నమయ్య జిల్లాను ఉంచాలని లేని పక్షంలో రాయచోటి నియోజక వర్గాన్ని కడప జిల్లాలో కలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు దృష్టికి మరియు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలని అన్నమయ్య జిల్లాను వుంచడానికి కృషి చేస్తానని లేని పక్షంలో రాయచోటి నీ కడప జిల్లాలో కలపడానికి కృషి చేస్తానని ఆయన తెలియచేశారు..

