నేటి సాక్షి కోదాడ (మోతె)మందు కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భర్త భార్యను కర్రతో హత్య చేసిన సంఘటన శుక్రవారం ఉదయం మోతే మండలంలోని విబలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…విబలాపురానికి చెందిన బండెల్లి అనే వ్యక్తి తరచూ మద్యం సేవిస్తూ ఇంట్లో గొడవలు సృష్టించే వాడని శుక్రవారం ఉదయం కూడా మద్యం కోసం డబ్బులు అడగగా, భార్య కరీంబి (45) నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన బండెల్లి ఇంట్లో ఉన్న కర్రతో ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.తీవ్రంగా గాయపడిన కరీంబిని గ్రామస్తులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మోతే ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ..





