Wednesday, March 4, 2026

*మద్యం తాగి వాహనం నడిపేవారు తస్మాత్ జాగ్రత్త*• డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక్కరికి జైలు శిక్ష•పలువురికి జరిమనా•కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి

నేటి సాక్షి కోదాడ ప్రతినిధి:మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు..ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ముగ్గురు పట్టుబడినట్లు ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. పట్టుబడిన వారిని మంగళవారం కోర్టులో హాజరు పరచగా ఒకరికి ఒక్క రోజు జైలు శిక్ష రూ.2000 జరిమానా, అదేవిధంగా మద్యం సేవించిన మరో ఇద్దరికీ రూ.4000/- జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ సత్యనారాయణ తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు….మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడే వారికి చలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News