నేటి సాక్షి నారాయణపేట, ఫిబ్రవరి 24, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని ఆత్మకూరు వెళ్లే రహదారిలో గల పెట్రోల్ బంకు ముందు కొనసాగుతున్న మద్యం దుకాణం అడ్డను మార్చాలని మరికల్ మండల ప్రజలు పేట జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులను కోరుతున్నట్లు వివిధ గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆత్మకూరు వెళ్లే రహదారిలో గల పెట్రోల్ బంక్ ముందు ఏర్పాటుచేసిన మద్యం దుకాణం అడ్డను మరోచోటకు మార్చాలని మద్యం ప్రియులు కోరుతున్నట్లు వివిధ గ్రామాల ప్రజల ద్వారా తెలిసింది. మద్యం దుకాణం ముందు పెట్రోల్ బంక్ ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పెట్రోల్ బంకు ముందు ఉన్న మద్యం దుకాణం అడ్డను మార్చేందుకు చర్యలను నారాయణపేట జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు తీసుకోవాలని మద్యం ప్రియులు ముందస్తుగా చర్చించుకుంటున్నారు. అధికారులు తెలిసి కూడా పెట్రోల్ బంక్ ముందు మద్యం దుకాణం ఏర్పాటు ఎలా చేస్తారని,… పెట్రోల్ బంక్ ముందు మద్యం దుకాణంకు ఎలా అనుమతులను అధికారులు ఇస్తారని మండల ప్రజలు, మద్యం ప్రియులు చర్చించుకుంటున్నారు.





