నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )అత్తారింటి నుంచి వెళ్లిన వ్యక్తి..బావిలో శవమై కనిపించిన ఉదంతం కలకలం రేపింది.! మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన గుండంపల్లి శంకర్ (42) మృతదేహం కోరుట్ల పట్టణ శివారులో లభ్యమైంది. *మద్యానికి బానిసై.. బావిలో శవమై..*గత ఒక సంవత్సరం కాలంగా మద్యానికి బానిసైన శంకర్, ఈనెల 13న ఉదయం సుమారు 6 గంటల సమయంలో మెట్ పల్లి లోని తన అత్తగారి ఇంటి నుంచి కట్లకుంట గ్రామానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు.ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కోరుట్ల శివారులోని డి-40 కెనాల్ సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న బంధువులు ఈ రోజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతుడు గుండంపల్లి శంకర్ అని నిర్ధారించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.______

