Thursday, January 22, 2026

మధ్యాహ్నం భోజనం బిల్లులు చెల్లించాలని ధర్నా…

వంటలు బంద్ చేసిన నిర్వాహకులు

నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 23,

పెండింగ్లో ఉన్న మధ్యాహ్నం భోజనం బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం ధన్వాడ ఎంఆర్సి కార్యాలయం ముందు ఏజెన్సీ నిర్వాహకులు ధర్నా నిర్వహించారు గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న మధ్యాహ్నం భోజనం బిల్లులతోపాటు 18 నెలలుగా పెండింగ్లో ఉన్న గుడ్ల బిల్లులు చెల్లించాలని కోరుతూ తరుణ నిర్వహించారు… అదేవిధంగా పెండింగ్ బిల్లుల కోసం ఏజెన్సీ నిర్వాహకులు సోమవారం పాఠశాలలో విద్యార్థులకు వంటలు ఉండలేరు బిల్లులు చెల్లించాలని కోరుతూ గత రెండు రోజుల క్రితం ఎంఈఓ గాయత్రి కి వంటలు వండము అంటూ నోటీసులు సైతం అందించారు దీంతో విద్యార్థులకు సోమవారం వంటలు వండలేదు దీంతో విద్యార్థులు భోజనానికి ఇబ్బంది పడ్డారు ఇంటి నుంచే టిఫిన్లు తెచ్చుకొని భోజనం చేశారు… పెండింగ్లో ఉన్న బిల్లులను వచ్చే విధంగా చూస్తామని ఎంఈఓ గాయత్రి ఏజెన్సీ నిర్వాహకులకు హామీ ఇచ్చారు… పెండింగ్ లో ఉన్న 18 నెలల గుడ్ల పిల్లలు మంజూర అయ్యేవిధంగా ఉన్నత అధికారులను కోరుతామని ఎంఈఓ హామీ ఇచ్చారు…. అనంతరం వివిధ డిమాండ్లతో కోరుతూ ఎంఈఓ కు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేష్.. మధ్యాహ్నం భోజనం నిర్వాకులు లక్ష్మి రేఖ భీమమ్మ అనంతమ్మ సాయమ్మ లక్ష్మి గీత తస్లీమ్ తో పాటుగా పలువురు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News