నేటిసాక్షి, రాయికల్ : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మధ్యాహ్న భోజన కార్మికురాలికి టీచర్లు ఆర్థిక సాయం చేసిన సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శుక్రవారం జరిగింది. రాయికల్ మండలం ఇటిక్యాల ఉన్నత పాఠశాల లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికురాలు పడాల శాంతమ్మ (50) క్యాన్సర్ వ్యాధి బారినపడడంతో ఇటిక్యాల ఉన్నత పాఠశాల ప్రస్తుత, పూర్వ ఉపాధ్యాయులు, కొందరు గ్రామపెద్దలు కలిసి రూ. 21వేల సాయం అందజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, ఆర్,యు.పి.పి. రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, పి.ఆర్.టి.యు రాష్ట్ర కార్యదర్శి గాజంగి రాజేశం, ఎద్దండి రమేష్, స్వర్ణలత, శ్రీలత, నీరజ, నాగలక్ష్మి ఉపాధ్యాయ బృందం పేషెంట్ కు అందజేశారు. ఫోటో రైటప్: 13RKL02: ఆర్థిక సాయం చేస్తున్న దృశ్యం





