నేటి సాక్షి 10 ఫిబ్రవరి పాములపాడు:- పాములపాడులోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయము మీటింగ్ హాల్ నందు ఇన్చార్జి మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి.తిరుపాలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.సరళ మెడికల్ ఆఫీసర్ ఇవి.నాగ లక్ష్మిదేవి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, సిజెవి-రవికుమార్ ఆరోగ్య పర్యవేక్షకులు ఎం.మద్దయ్య ల ఆధ్వర్యంలో మండల స్థాయి టిబి ముక్తు పంచాయతీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులకు క్షయ వ్యాధి మందుల పంపిణీ, ఫుడ్ బాస్కెట్స్ మరియు ఐపిసిపి ఫాలో అప్ కుటుంబ స్క్రీనింగ్లు, వండర్ఫుల్ లిస్ట్ లోని వారందరికీ గ్రామంలోని క్షయ వ్యాధి స్క్రీనింగ్ చేసి క్షయ రహిత గ్రామముగా తీర్చిదిద్దుటలో సర్పంచ్, గ్రామ సెక్రెటరీ హెల్త్ వెల్నెస్ సెంటర్ లో పనిచేయుచున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఆరోగ్య కార్యకర్త, ఆశ వర్కర్లు గ్రామంలోని అధికారులు అందరు కలిసి టీబి ముక్త్ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఇన్చార్జి మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ టి.తిరుపాలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.సరళ, పిహెచ్సి వైద్యాధికారిణి ఈవీ.నాగలక్ష్మి దేవి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు ఎం.మద్దయ్య మరియు పంచాయతీ కార్యదర్శి కె.హిస్టో రాణి, పాములపాడు మండల హెల్త్ వెల్నెస్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కే.రేణుక దేవి, పి. ప్రమీల, జి.రత్నమ్మ, బి.సునీత రాణి, ఎన్.శిరీష, కె ప్రియాంక, ఎం.నాగ భారతి, పి.మాళవిక. విలేజ్ హెల్త్ సెక్రటరీలు, ఆరోగ్య కార్యకర్తలు, పి.మాధవి, ఎం.శారదమ్మ, వి.జయలక్ష్మి, సి.సుదర్శనమ్మ, పీకె.అనురాధ, బి.రమణమ్మ, డి.మరియమ్మ, ఏసి చౌడమ్మ, పాములపాడు మండలంలోని, అందరూ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

