*నేటి సాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం బిజెపి మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో మానస దేవి ఆలయంలో సోమనాథ్ స్వాభిమాన పర్వం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 జనవరిలో ఘజనీ మహమ్మద్ అమర్నాథ్ ఆలయం పై దాడి చేసి మందిరాన్ని కూల్చివేశాడు. విశ్వాసం, నాగరికతకు సంబంధించిన ఈ గొప్ప చిహ్నంపై అనాగరిక దండయాత్ర జరిగి 2026 సంవత్సరంకు 1000 సంవత్సరాలు పూర్తయింది. సోమనాథ్ మందిరం ఈ 1000 సంవత్సరాల సహనాన్ని, పునరుజ్జివనాన్ని నిరంతరం నిలబడ్డానికి గుర్తుగా మనం ఈ సంవత్సరాన్ని సోమనాథ్ స్వాభిమాన పర్వంగా జరుపుకుంటున్నాము. 1000 సంవత్సరాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఆలయం ఇప్పటికీ సగర్వంగా, వైభవోపేతంగా నిలబడింది. సోమనాథ్ వైభవాన్ని పునరుద్ధరించడానికి జరిగిన నిరంతర, సమిష్టి ప్రయత్నాలకు ఇది చిహ్నం. మందిర నిర్మాణం 75వ వార్షికోత్సవం కూడా 2026 లోనే జరుగుతుంది 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షంలో సోమనాథ్ ఆలయాన్ని భక్తుల కోసం తెరిచారు. 2026 దండయాత్ర మూడు రోజుల పాటు కొనసాగింది. ఈ హృదయ విధారక గాయాన్ని స్మరించుకుంటూ సోమనాథ్ సమగ్రతకు నిరాజనం అర్పిస్తూ, ఈ రోజు మానసా దేవి ఆలయంలోని శివునికి ఓంకార మంత్రం పఠించి అభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. వీరి వెంట బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, మనసాదేవి ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మచ్చ మురళీకృష్ణ, సందవేని ప్రశాంత్ యాదవ్, టేకు అనిల్, బద్దం వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి, బద్దం శివరెడ్డి, కాటిపెల్లి అజయ్ రెడ్డి, సన్నీ, ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్ నాథ్ శర్మ పాల్గొన్నారు.

