ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి
- కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రతి ఒక్కరి కి అందేలా చూడాలి సీనియర్ నాయకులు షామీర్పేట ధర్మారెడ్డి,
- బిజెపిలో చేరిన యువత కండువా కప్పి ఆహ్వానించిన డాక్టర్ శిల్పా రెడ్డి
నేటి సాక్షి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి
ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన మన్ కి బాత్ కార్యక్రమాన్ని ఉప్పల్ డివిజన్ బిజెపి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు మరినేని ఫణింద్ర నేతృత్వంలో ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన వీడియో ప్రదర్శిస్తూ ప్రజలకి కేంద్ర ప్రభుత్వ పథకాలు ను రివ్యూ ద్వారా తెలియజేయడం జరిగింది అనంతరం మన్ కి బాత్ లైవ్ ప్రోగ్రాం వీక్షించడం జరిగింది తదుపరి ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఫణీంద్ర ప్రధాన కార్యదర్శి తీగ విఠల్ రావు ముదిరాజ్ ఆధ్వర్యంలో కుమ్మరి బస్తి మహంకాళి బస్తీ చాకలిబస్తీ యువకులను శిల్పా రెడ్డి ధర్మారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా
సీనియర్ నాయకులు షామీర్పేట్ ధర్మారెడ్డి 1980లో గాంధీ బొమ్మ దగ్గర భారతీయ జనతా పార్టీని కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్లో ఏర్పాటు చేయడం జరిగిందని మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనను ప్రజలకు తెలియజేసే విధంగా గాంధీ బొమ్మ దగ్గర ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు అధ్యక్షులు మారినేని ఫణీంద్ర మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వం బలపరిచే విధంగా ఇంకా ముందు ముందు యువకులు అధిక సంఖ్యలో పార్టీలో చేరుతారని అలాగే ఉప్పల్ బిజెపి ఎల్లవేళలా ప్రజలకి అండగా నిలుస్తుందని ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తారని కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని అన్నారు రానున్న రోజుల్లో ఉప్పల్ డివిజన్ మరింత బలోపేతంగా చేస్తామని అన్నారు చివరగా మహిళా మార్చ అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ యువత ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీ ముందడుగు వేయడానికి సహకరించాలని ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని యువత ముద్దడుగు వేస్తే ఉప్పల్ గడ్డ బిజెపి అడ్డగా మారుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శామీర్పేట ధర్మారెడ్డి బలవంత చారి చోలేటి బ్రహ్మచారి రామోజీ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ శ్రీధర్ గుప్తా డివిజన్ కోశాధికారి దువ్వాళ రమేష్ డివిజన్ ఉపాధ్యక్షులు భవిష్ ప్రసాద్, నామ అనిత ప్రధాన కార్యదర్శి నామ శ్రవణ్ సీనియర్ నాయకులు గొరిగ వెంకటేష్ , ఆడెపు రమేష్ పునీందర్ అంజి రెడ్డి మద్దెల పద్మ గొరిగి శ్రీనివాస్ మేకల దయా సాగర్ రెడ్డి , కట్ట కృష్ణారెడ్డి , విజయ్, స్వామి గౌడ్, వెంకట్, రాహుల్ భాగ్యరాజ్ రాజు చారి బర్ల మహేష్ ఉదయ్ చారి మహేష్ గౌడ్ శైలజ వాణి లలిత తదితరులు పాల్గొన్నారు.





