నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష గారి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి, శాసనమండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, నగర కమిషనర్ మౌర్య అధికారులు, సిబ్బంది హాజరైనారు. గ్రేటర్ పరిధిలోకి 10 గ్రామ పంచాయతీలను విలన ప్రతిపాదనను ప్రభుత్వం చేయగా నగర మేయర్ డా శిరీష విలీన ప్రాంత పరిధిని విస్తరిస్తూ సవరణ తీర్మానం ప్రతిపాదించారు. సవరణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ…ప్రభుత్వ ప్రతిపాదనకు పరిపుస్టత చేకూర్చడం కోసమే సవరణ తీర్మానం. మన ప్రతిపాదనలు భవిష్యత్తులో ప్రశ్నార్ధకం కాకూడదు. సరైన నిర్ణయాలు చేయలేదన్న అపవాదు మన మీద రాకూడదు.మన తిరుపతి నగరం మహానగరంగా ఎందుకు మారాలి ? మార్పుకు ప్రామాణికంగా ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అన్నది ముఖ్యం గ్రేటర్ తిరుపతి సరిహద్దులు ఎంత వరకు ఉండాలి అన్నది కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాలి. నీటి సరఫరా భూమి మౌలిక వసతులు వాతావరణ సమతుల్యత రవాణా టిటిడితో సంబంధం లేని తిరుపతిని ఊహించుకోలేము. శ్రీవారి భక్తుల రాకపోకలు, వసతుల కల్పన కూడా కీలకం. స్థూలంగా ప్రస్తుత నగరం పై ఒత్తిడి తగ్గాలి.. తగ్గే ఒత్తిడి విలీన ప్రాంత అభివృద్ధికి దోహదపడాలి.మనం గ్రేటర్ హైదరాబాద్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ చేసినప్పుడు కోర్ హైదరాబాద్ కి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు, 10 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఐటెక్ సిటీకి కిలోమీటర్ల దూరంలో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నిర్మాణం చేపట్టారు. నాడు అందరూ అన్ని కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అవసరమా ? అన్నారు నేటి అనుభవం ఏమి చెపుతుంది. నాడు దూరం అయిన శంషాబాద్ ఎయిర్ పోర్టు నేడు దగ్గర అయినది.. కిలోమీటర్ల దూరంలో రింగ్ రోడ్డు నిర్మాణం చేయకపోతే నగర విస్తరణ తర్వాత రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యం అయ్యేదా ? నగర విస్తరణ తర్వాత మౌలిక సదుపాయాలు కల్పన కష్టం హైదరాబాద్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాగా దూరదృష్టితో ముందే ఏర్పాటు చేయడం సులభం.. తిరుపతి నగరంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్న శ్రీవారి భక్తుల రాకపోకలు తమిళనాడు నుంచి పుత్తూరు వైపు, కర్ణాటక నుంచి చంద్రగిరి వైపు, ఏపీ నుంచి శ్రీకాళహస్తి వైపు ఉంటాయి. భవిష్యత్తులో అందుకు అనుగుణంగా వారికి సౌకర్యాలు ఏర్పాట్లు చేసుకోవాలి. మన గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన కూడా అందుకు అనుగుణంగా ఉండాలి. నగర పాలక సంస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భూమి. ప్రస్తుత నగర పరిధిలో ఉన్న భూమి టిటిడి మరియు మఠం భూమి మాత్రమే ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా భూమి లేకపోవడం ప్రధాన ఆటంకంగా మారుతుంది. గ్రేటర్ తిరుపతిలో వీలైనంత ప్రభుత్వ భూమి అందుబాటులోకి వచ్చే విధంగా ఆలోచించాలి.ప్రస్తుత తిరుపతి నగరానికి నాలుగు వైపులా విస్తరణ ఉండాలి. చంద్రగిరి వైపు కల్యాణి డ్యామ్ వరకు రామచంద్రపురం మండలం రాయలచెరువు వరకు ఉండాలి.. కల్యాణి డ్యామ్ మన నీటి సరఫరాకు కీలకం. అలాంటి డ్యామ్ నగర పరిధిలో లేకుంటే క్లిష్ట సమయంలో నీటి సరఫరాకు ప్రతిబంధకాలు ఏర్పడుతాయి. రామాపురం వద్ద వెస్ట్ మేనేజ్ మెంట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డాయో అందరికీ తెలుసు అదే విధంగా రాయలచెరువు నగర పరిధిలోకి వస్తె భవిష్యత్తు నీటి సరఫరాకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. తిరుపతి ఎయిర్ పోర్టు కు సమీపంలో ఉండటం టిటిడి ఉద్యోగులకు వడమాలపేట మండల పరిధిలోని అంజెరమ్మ కణం వద్ద 5 వేల మంది కి ఇళ్ల స్థలాలు టిటిడి ఇచ్చింది. ఇదే ప్రాంతంలో మిగిలిన వారికి ఇచ్చే ఆలోచన ఉన్నది. దాదాపు 10 వేల మంది తో టైన్ షిప్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నది.. మరో వైపు తమిళనాడు భక్తులు రాకపోకలు జరిగే ప్రాంతం కనుక అక్కడి వరకు విస్తరణ ఉండాలి. ఐఐటీ పరిధి వరకు మన సరిహద్దులు ఉండాలి. ఈ మొత్తం ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్, వెస్ట్ స్టేషన్, చంద్రగిరి, తిరుచానూరు, రేణిగుంట, ఏర్పేడు రైల్వేస్టేషన్లు నగర పరిధిలోకి వస్తాయి. రాయలచెరువు, మల్లిమడుగు, కల్యాణి డ్యామ్, విస్తారంగా చెరువులు, ప్రభుత్వ భూమి మనకు అందుబాటులోకి వస్తాయి. మేయర్ ప్రతిపాదించిన గ్రేటర్ పరిధి కల్యాణి డ్యామ్, రాయలచెరువు, అంజేరమ్మ కణం, ఐ ఐ టి వరకు. మేయర్ ప్రతిపాదించిన గ్రేటర్ తిరుపతి విస్తరణ ప్రతిపాదనపై సభ్యులు సానుకూలంగా స్పందిస్తూ తమ అంగీకారాన్ని తెలపడంతో కౌన్సిల్ ఆమోదించినట్లు మేయర్ డాక్టర్ శిరీష ప్రకటించారు.





