నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 23 ~అన్నమయ్య జిల్లా :-: మన పథం అభివృద్ధి.మన లక్ష్యం వైయస్ జగన్ ను మళ్ళీ సీఎం చేయడమేనని నిస్సార్ అహ్మద్ మదనపల్లి సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం నిమ్మనపల్లి మండల వైసీపీ శ్రేణులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తగువు పై ఆరా తీశారు. అనవసర వివాదాలకు దూరంగా వుందామని కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు తావివ్వకుండా వుండాలని నిస్సార్ అహ్మద్ సూచించారు. గ్రామంలోకి విచ్చేసిన నిస్సార్ అహ్మద్ ను వైసీపీ శ్రేణులు సాదర స్వాగతం పలికారు. బాణాసంచా పేలుస్తూ డప్పులు వాయిస్తూ, పూలహారాలతో, గజమాలను వేసి తమలోని అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన చిన్న గొడవ ఫ్లెక్సీల వివాదంపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం నిమ్మనపల్లెలో జరిగిన ఫ్లెక్సీల వివాదంపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ 2.0 ఆచరణ లో కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నారని గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మళ్లీ జగన్ ను సీఎంగా చేసుకోవాలంటే అందరూ కలిసి పని చేద్దామని సూచించారు. చిన్న, చిన్న వివాదాల కారణంగా కేసులు నమోదు అయ్యేలా చేసుకోవడం తద్వారా కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులకు గురయ్యేలా చేసుకోవద్దని నిస్సార్ అహ్మద్ సూచించారు. కూటమి పాలనలో ఇబ్బందులు పడే కార్యకర్త, నాయకుల వివరాలు డిజిటల్ బుక్ లో నమోదు చేయడం జరుగుతుందని జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు. మన పథం అభివృద్ధి అని, మన లక్ష్యం మళ్ళీ జగన్ ను సీఎం చేసుకోవడమేనన్నారు. అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలని వస్తేనే అభివృద్ధి సాధిస్తుందని జగన్ రావాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇలా జరగాలంటే మనమంతా సమైక్యంగా నిలబడి ప్రజా సమస్యలపై పోరాడితేనే సాధ్యమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, రమణా రెడ్డి, రెడ్డిశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హేమంత్, జయప్రకాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రఫీ , షరాఫత్, నూర్ మొహిద్దీన్, నాగరాజ్, వెంగంవారిపల్లి శ్రీనివాసులు రెడ్డి, వెంగంవారిపల్లె, దావూద్, శ్రీనివాసులు రెడ్డి, హోటల్ రఫీ, నరేష్, యోగానంద రెడ్డి పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~





