నేటి సాక్షి – కోరుట్ల
( రాధారపు నర్సయ్య )
కోరుట్ల పట్టణంలో వరుసగా రెండో సంవత్సరం ‘మన ప్రెస్ క్లబ్’ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఎన్నుకున్నారు.
మరోసారి అధ్యక్షుడిగా ఉరుమడ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా సైదు గంగాధర్,లతో పాటు..
నూతన కార్యవర్గం ప్రధాన కార్యదర్శిగా.. కత్తిరాజ్ శంకర్.. ఉపాధ్యక్షుడిగా గిన్నెల శ్రీకాంత్, గౌరవ సలహాదారులుగా కటుకం గణేష్, లింగ ఉదయ్ కుమార్, తీగల శోభన్ రావు, గంగుల శ్రీనివాస్, కోశాధికారిగా కట్టెకోల సురేష్ ను ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గానికి సత్కారం
నూతనంగా ఎన్నికైన ‘మన ప్రెస్ క్లబ్’ కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ.. వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి భాను శాలువాలతో సత్కరించారు.





