( నేటి సాక్షి): శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు శ్రీ మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో నూతన సంవత్సరం వేళ గురువారం సుమారు 25 వేల మంది భక్తులు హాజరై, క్యూలైన్లో నిల్చుని, స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు పూర్తిగా అభిషేకాలు రద్దు చేశారు. ఆలయ అర్చకులు సాయిశివ, ప్రమోద్, వీరేష్ లు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. న్యూ ఇయర్ రోజున ఆలయాలను దర్శిస్తే అన్ని శుభాలు జరుగుతాయని, భక్తులు నమ్మకం అని ఆలయ గౌరవ అధ్యక్షుడు సదానందం గౌడ్ తెలియజేశారు. దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు మీడియాతో చెప్పారు. ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐలు శ్రీనివాస్ గౌడ్, వీరబాబు గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు సురేష్, సంతోష్ రెడ్డి, శ్రీశైలం, అన్నదాన కమిటీ చైర్మన్ దర్శన్ గౌడ్, కమిటీ సభ్యులు జనార్ధన్, హనుమంతు తదితరులు ఉన్నారు.

