నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 29, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం పరిధిలోని మరికల్ గ్రామ ఎన్నికల అధికారిగా పాలెం శివయ్య బాధ్యతలు శనివారం స్వీకరించారు. సహాయ అధికారిగా జి.లక్ష్మయ్య బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మరికల్ గ్రామంలోని వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి వివరించారు. నిబంధనలు పాటించి ఎన్నికల అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.





