నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 25, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు, ఇట్టి డ్రైనేజీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరన్న, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, నాయకులు రామకృష్ణ, గోవర్ధన్,చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.





