సాక్షి,నారాయణపేట. జూన్ 19, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గురువారం నిర్మూలనకు ప్రతి ఒక్కరు ఓఆర్ఎస్ ప్యాకెట్ను వాడాలంటూ ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో మరికల్ మండల కేంద్రంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మరికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గోరువెచ్చని నీళ్లను ప్రతి ఒక్కరు తాగాలని అట్టి వాటర్ లో వారేజ్ ప్యాకెట్ను తప్పనిసరిగా వాడాలన్నారు. ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి అతిసారా వ్యాధిపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన వివరించాడు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరిమి, శ్రావణి, అర్చన, సూపర్వైజర్ ల్యాబ్ టెక్నీషియన్ అధికారులు మరియు హాస్పటల్ సిబ్బంది ఆశా కార్యకర్తలు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

