నేటి సాక్షి, నారాయణపేట,జనవరి14,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో యువకమండలి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం నాడు మరికల్ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ఆవరణలో క్రికెట్ టోర్నమెంట్, అదేవిధంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి, యువకులు క్రీడల్లో ఉన్నత స్థాయి స్థానంలో రాణించాలని ఆయన కోరారు. క్రీడల్లో గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య,మరికల్ యువక మండలి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మరికల్ గ్రామ అఖిలపక్ష నాయకులు మాజీ సర్పంచ్ కె, గోవర్ధన్, మరికల్ గ్రామం మాజీ ఎంపిటిసి సీమ గోపాల్, ఎల్ రాములు, నాగరాజు, మరికల్ ఎస్సై రాములు, రామకృష్ణారెడ్డి, టైసన్ రాఘవేంద్ర, రామకృష్ణ, పెంట మీద రఘు, రామన్ గౌడు, మల్లయ్య,మరికల్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

