నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 21,11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి మరలా గుర్తుచేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 6 గంటలకు జిల్లా పరిషత్ హై స్కూల్ మరికల్ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మరికల్ సబ్ ఇన్స్పెక్టర్ రాములు సార్ గారు విచ్చేశారు.ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు, యువకులు, అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

