నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 16, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను అధికారులు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. సూర్య మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ లో మరికల్ మండల ఎంపీడీవో కొండన్న గ్రామపంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సురే మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ పరిశీలనలో బెలగొంది వీరన్న, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కాటేకొన్న ఆంజనేయులు, నాయకులు రామకృష్ణారెడ్డి,, ఎన్ ఎస్ యూ వై నాయకులు అన్వర్ చెన్నయ్య రాఘవేంద్ర పెంట మీది రఘు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.




