Wednesday, March 4, 2026

మరికల్ లో మహిళ సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ ఈజీఎస్ పథకం కింద రూ, 10 లక్షలు మంజూరు….పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ .సూర్య మోహన్ రెడ్డి…..

నేటి సాక్షి,, నారాయణపేట జిల్లా రిపోర్టర్, మార్చ్, 4,( రిపోర్టర్ ఇమామ్ సాబ్),నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల మండల కేంద్రంలో ఈజీఎస్ పథకం కింద మహిళ సమైక్య భవనా నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి మరికల్ గ్రామ సర్పంచ్ గోప చెన్నయ్య ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలను మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నదని చేపడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల ఎంపీడీవో భృతి విరాజ్, మరికల్ మండల ఏపీఎం చెన్నప్ప, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలగొంది వీరన్న, మరికల్ మండలం పంచాయతీరాజ్ ఏఈ ప్రవీణ్ కుమార్, మహిళా సమాఖ్య సిసి హనుమంతు, మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, వార్డు సభ్యులు పెంట మీద రాఘవేంద్ర, ఎనిమిదో వార్డు సభ్యులు ఎల్ శివకుమార్, సురిటి చంద్రశేఖర్, వివిధ వార్డ్ సభ్యులు తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, రామకృష్ణ, రఘు టైజన్, ఇంకా చింతలయ్య, మాజీ ఎంపిటిసి సీమ గోపాల్, మహిళా సమైక్య సభ్యులు మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News