కేసు నమోదు…..
14 క్వింటాలన్నర బియ్యం పట్టుకున్న హైదరాబాద్ ఎంపోర్స్మెంట్ అధికారులు
నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 14,
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో రేషన్ దుకాణాలను హైదరాబాద్ చెందిన ఎంపోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీల్లో మరికల్ మండల కేంద్రంలో ఒక రేషన్ డీలర్ షాప్ లో స్టాక్ ను బియ్యం ను పరిశీలించగా అట్టి దుకాణంలో 14 క్వింటాళ్ల నర బియ్యం పట్టుకున్నట్లు హైదరాబాదుకు చెందిన ఎంపోర్స్మెంటు నాగరాజు తెలిపారు. ఇట్టి 14 క్వింటాళ్ల నర బియ్యం పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన ఎంపోర్స్మెంట్ అధికారి నాగరాజు వివరించారు. పట్టుకున్న ఇట్టి బియ్యంను మండల స్థాయి రెవిన్యూ అధికారులకు అప్పగించడం జరిగిందని ఆయన వివరించారు.

