నేటి సాక్షి, నారాయణపేట డిసెంబర్ 28, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని శ్రీవాణి హై స్కూల్లో ఆదివారం నాడు రైతు మహోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మరికల్ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న రైతులు భారీ ఎత్తున హాజరయ్యారు. వివిధ పంటలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో వివిధ పంటల నిపుణులు, శ్రీవాణి హై స్కూల్ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మ,, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినీతమ్మ, పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, సర్పంచు గోప చెన్నయ్య,, ఉపసర్పంచ్ కాజా, మరికల్ గ్రామ వివిధ వార్డు సభ్యులు, మరికల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరన్న,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్, పాఠశాల సిబ్బంది పూర్ణిమ శివ లీల, రఘు, ఉపేందర్,వసంత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

