నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 9 , ( రిపోర్టర్ ఇమామ్ సాబ్),మరికల్ మండల కేంద్రంలోని పలు వార్డులలో శుక్రవారం నాడు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో పాఠశాలల విద్యార్థులచే రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమం మరికల్ గ్రామంలోని పలు వార్డులలో నిర్వహించారు. అనంతరం ఇంద్ర గాంధీ చౌరస్తాలో రోడ్డు భద్రోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా ఆర్టిఏ అధికారి దీపిక గౌడ్ మాట్లాడుతూ వాహనదారులు సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రయాణించకూడదన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. ప్రతి వాహనానికి ఆర్టిఏ కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆర్టిఏ కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్ లేని వాహనాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. అనంతరం ఈ ర్యాలీ కార్యక్రమం మరికల్ జిల్లా పరిషత్ బాలిక బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మరికల్ మండల ఎంఈఓ మహమ్మద్ మీర్జా కరీముల్లా, మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య, ఉప సర్పంచ్ కటిక కాజా, శ్రీకాంత్ రెడ్డి, మరికల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, మరికల్ వార్డు సభ్యులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,మరికల్ గ్రామ వార్డు సభ్యులు గ్రామ యువకులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

