: నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 4, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),పేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఆదివారం నంది ఫంక్షన్ హాల్ లో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన ధన్వాడ, మరికల్ మండల ముదిరాజ్ సర్పంచ్, వార్డు సభ్యులకు, మరికల్ మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ విషయమై ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ, ముదిరాజులు స్థానిక ఎన్నికలతో పాటు రాబోయే ఎన్నికల్లో కూడా తమ సత్తాను చాటి విజయం సాధించాలని అభిప్రాయపడ్డారు. ముదిరాజులు విద్యా, రాజకీయం, తదితర అంశాలలో ముందుండి విజయం సాధించాలని కోరారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కలిసికట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల ముదిరాజ్ నాయకులు కానుగంటి నారాయణ,సురిటి చంద్రశేఖర్, పెంట మీది నర్సింలు, పటేన్ శ్రీను, నర్సింలు నాయుడు, గౌని శ్రీనివాసులు, పి. రామకృష్ణ, పోలెమెని రమేష్, సురిటి బన్నీ,టైలర్ మొగులప్ప, పి. ఆనంద్ కుమార్, రవికిరణ్,అడిగోని శేఖర్ , సహదేవ్, పెంట మీది రాఘవేందర్, ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, పెద్ద విజయ్, కోళ్ల వెంకటేష్, లక్ష్మీ గారి ఆంజనేయులు ముదిరాజ్,, గాదం మల్లేష్, తదితర నాయకులు , యువకులు పాల్గొన్నారు.

