Wednesday, March 18, 2026

మల్రెడ్డి రాంరెడ్డి నగర్‌లో సీసీ రోడ్ పనులకు శ్రీకారం14 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభం.*

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 13:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడ గ్రామ పరిధి మల్రెడ్డి రాంరెడ్డి నగర్ కాలనీ రోడ్ నంబర్–2లో సీసీ రోడ్ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.ఈ పనులు రూ.14 లక్షల జనరల్‌ ఫండ్స్‌తో చేపట్టబడ్డాయి.కాలనీ వాసులతో కలిసి సీసీ రోడ్‌ నిర్మాణ పనులను పరిశీలించిన నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం,అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.గత బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి పనులు నిర్లక్ష్యం చెయ్యడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేయడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.ముఖ్యంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ,కాలనీలలో అంతర్గత రోడ్లు మరియు మెయిన్‌ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.ఈ సందర్భంగా సీసీ రోడ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినసీఎం రేవంత్ రెడ్డి,జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు,మహేశ్వరం ఇన్‌చార్జ్ కే.ఎల్.ఆర్,పారిజాత నరసింహ్మారెడ్డి,మున్సిపల్‌ కమిషనర్ సరస్వతి,డీఈ,ఏఈలకు కాలనీ వాసుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారు మల్లా రెడ్డి,జగన్నాధం,యాదగిరి,పోతులూరి చారి,మనోహర్ రెడ్డి,వెంకటరమణ,బాషా వెంకటేశ్వర్లు,అశోక్ చారి,మహేష్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News