Thursday, March 26, 2026

*మల్లన్నపేట మల్లన్న జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.**భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్**

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండలం మల్లనపేటలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. నవంబర్ 26 తేదీ నుండి డిసెంబర్ 17 వ తేదీ వరకు జరుగు జాతర సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఆలయ పరిసరాల్లో క్యూలైన్లలో వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.ఆయన వెంట డిఎస్పి రఘు చందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్,సి.ఐ రవి, ఎస్.ఐ కృష్ణ సాగర్ రెడ్డి ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News