నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 23 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని తంబళ్లపల్లి మండల కేంద్రమైన సిద్దుల కొండ, మల్లయ్య కొండ లపై కొలువుదీరి సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన మల్లయ్య స్వామి గా పిలవబడుతూ కోరిన కోర్కెలు తీర్చే మలయప్ప స్వామిగా, సంతాన ప్రాప్తి అమ్మవారికి విరాజిల్లుతున్న మహిమాన్వితా క్షేత్రం శ్రీశ్రీశ్రీ భ్రమరాబికా సమేత మల్లికార్జున స్వామి వారిని నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి దర్శించుకొని పునీతులయ్యారు. మంగళవారం ఆయన అనుచరులతో కలిసి మల్లికార్జున స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం వద్దకు విచ్చేసిన వీరిని ఆలయ పూజారులు పూర్ణకుంభాలతో ప్రదక్షిణానంతరం ఆలయంలోనికి స్వాగతించారు. దగ్గరుండి స్వామివారి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ పూజారులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కొండపై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. త్వర తగతిన పనులు పూర్తి చేయాలని పనులు నెమ్మదిగా సాగుతున్నాయని కాంట్రాక్టర్ పై మండిపడ్డారు. మహాశివరాత్రి పర్వదినం మరి 3 నెలల్లో రాబోతా ఉందని స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది విచ్చేస్తారని పనులు చూస్తే నత్తనడకన సాగుతున్నాయని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. కొండపై వివిధ పరిసరాల్లో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆలయ కొండ కింద భాగాన వేలాది మందికి ఉచితంగా అన్నదానం అందించే చోటు వద్దకు వెళ్లి నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డు, అక్కడ జరుగుతున్న పనులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం వైసీపీ శ్రేణులు ద్వారకానాథ్ రెడ్డిని దుశ్శాలువ కప్పి పుష్పగుచ్చమందించి సన్మానించారు. అన్నదాన కార్యక్రమ షెడ్డు కు సహకారం అందిస్తానని శివరాత్రి నాటికి పనులన్నీ పూర్తవాలని అన్నదాన ట్రస్ట్ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ సుమారు 800 సంవత్సరాలు చరిత్ర కలిగిన మల్లయ్య కొండ క్షేత్ర అభివృద్ధికి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎనలేని కృషిచేసి ఆయన సహకారంతో ఎంతో అభివృద్ధి సాధించింది. ఎన్నో ఏళ్లుగా తాతల కాలం నాటి నుండి కొండపై భాగం సుమారు 8 కిలోమీటర్లు మేర భక్తులు నడిచి వెళ్లి స్వామిని దర్శించుకునేవారు. ఎన్నో పార్టీలు అధికారాన్ని శాసించాయి. ఈ తంబళ్లపల్లి నియోజకవర్గం నుండి ఎంతోమంది శాసనసభ్యులు గెలిచారు. కానీ ఏ శాసనసభ్యులు మల్లయ్య కొండ క్షేత్రాన్ని పట్టించుకోలేదు. అలాంటిది ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గానికి అడుగుపెట్టినప్పటి నుంచి అభివృద్ధి పరుగులు తీస్తూనే ఉంది. కోట్లాది రూపాయల వ్యయంతో కొండపైకి రోడ్డు మార్గం నిరంతరం తాగునీరు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ద్వారకానాథ్ రెడ్డి శాసనసభ్యులుగా గెలిచినప్పటి నుంచినే ఈయన సహకారంతో ప్రత్యేక చొరవ చూపాయి. రోడ్డు మార్గం పూర్తయ్యే వరకు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నిద్రలేని రోజులు గడిపారు. ప్రతిరోజు రోడ్డు మార్గాన్ని పర్యవేక్షించారు. ఆయన చొరవతోనే నేడు కొండపైకి బస్సులు వెళ్తున్నాయని వైసీపీ శ్రేణులు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి సాధించని నియోజకవర్గ అభివృద్ధి గత వైసీపీ పాలనలో శరవేగంగా అభివృద్ధి పరుగులు తీసింది. మారుమూల గ్రామానికి వెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం, గ్రామాల్లో నిరంతరం విద్యుత్, డ్రైనేజ్, తాగునీరు ఇలాంటివి కాకుండా మరెన్నో సౌలభ్యాలు అందించిన ఘనత ద్వారకానాథ్ రెడ్డి కి అన్నారు. ఎవరూ చేయలేనంత అభివృద్ధిని చేసి చూపించారని వైసీపీ శ్రేణులు వెల్లడించారు. ఈ మేరకు ద్వారకనాథ్ రెడ్డి వెంట సురేంద్ర, మండలాధ్యక్షుడు రేపన చౌడేశ్వర, వైస్ ఎంపీపీ కరీం, ఫారెస్ట్ రాజారెడ్డి, నారాయణరెడ్డి, రామ్మూర్తి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~





