-దేవరకద్ర మండల యువజన కాంగ్రెస్ నాయకుడు చందు గౌడ్..
నేటి సాక్షి, దేవరకద్ర జులై 8
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మళ్లీ పుట్టి రావాలి రాజన్న(వైయస్ రాజశేఖర్ రెడ్డి) అని దేవరకద్ర మండల యువజన కాంగ్రెస్ నాయకుడు కోయిల్ సాగర్ చందూ గౌడ్ అన్నారు. దేవరకద్రలో మంగళవారం ఆయన మాట్లాడారు.అభివృద్ధి సంక్షేమం తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మరపురాని మహానేత ద స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పాదయాత్రలో ప్రజల బాధలను వింటూ సంకల్పంతో సాగిన ప్రతి అడుగు ప్రజల గుండెల్లో ఆశలు నాటి ఆశయాలతో పాలన సాగించిన ఆదర్శ నాయకుడు వైయస్సార్ అని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు కార్పొరేటర్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్నందుకు ఆరోగ్యశ్రీని, రైతు కళ్ళల్లో ఆనందం నింపడానికి ఉచిత విద్యుత్,రుణమాఫీ,