Saturday, March 21, 2026

మళ్లీ బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు జోరు..రంగసముద్రం లో బెల్టు షాపుపై మెరుపు దాడి..180 మద్యం బాటిళ్లు స్వాధీనం..సివిల్ పోలీసులకు చిక్కిన మద్యం ఎక్సైజ్ శాఖ కు దొరకదా..!

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని పెద్ద తిప్ప సముద్రం మండల కేంద్రమైన రంగసముద్రం గ్రామంలో ఓ బెల్టు షాపుల్లో భారీ ఎత్తున మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వీరి ఆగడాలు శృతిమించడంతో కొందరు స్థానికులు పెద్ద తిప్ప సముద్రం నూతన ఎస్ఐ పరమేశ్వర్ నాయక్ కు సమాచారమందించారు. ఆయన సిబ్బందితో తక్షణమే గ్రామానికి వెళ్లి బెల్టు షాప్ పై మెరుపు దాడి చేశారు. బెల్ట్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఓ గదిలో ఉన్న మద్యం బాటిళ్లను చూసి పోలీసులు విస్తుర పోయారు. అక్కడ నిలువ ఉంచిన మద్యమంతా ప్రతాప్ రెడ్డికి చెందింది గా పోలీసుల విచారణలో తేలింది. బెల్టు షాప్ బాధ్యతలు చూస్తున్న శబరిష్ ను విచారించారు. ఆయన పోలీసులపైనే ఎదురు ప్రశ్నలు వేశారు. మేము అమ్ముతుండగా మీరు చూశారా అంటూ ఎస్ ఐ పరమేశ్వర నాయక్ ను బుక్కాయించే యత్నం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ రంగసముద్రం లో మొత్తం 180 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని బెల్టు షాప్ విక్రయ దారుడు, అమ్మకం దారుడు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వారిపై ఎఫ్ ఐ ఆర్ కేసు నమోదయిందని స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ల ను కోర్టుకు తరలిస్తామని ఎస్ ఐ పరమేశ్వర్ నాయక్ మీడియాకు వెల్లడించారు. సివిల్ పోలీసులకు దొరికిన మద్యం ఎస్సైజ్ పోలీసులకు ఎందుకు చిక్కదు.._________________________________________బెల్టు షాపులో మద్యం దొరకడంపై స్థానికులు మండిపడుతూ గత కొద్ది నెలలకు ముందు రాష్ట్రాన్నే కుదిపేసిన అక్రమ మద్యం తయారీ వ్యవహారం ఇంకా మర్చిపోక ముందే తాజాగా రంగసముద్రం లో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవడం మరో మారు ఉలికి పడేలా చేసిందని ములకలచెరువు కేంద్రంగా పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ వ్యవహారాన్ని సివిల్ శాఖ సహకారంతో ఎక్సైజ్ శాఖ పోలీసులు మెరుపు దాడి చేశారు. తయారవుతున్న యంత్రాలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. పెద్ద ఎత్తున మద్యం డంప్ బయటపడింది. ములకలచెరువు కేంద్రంగా తయారైన నకిలీ మద్యం బాటిళ్లను జిల్లాల సరిహద్దులలో చేర్చి విక్రయాలు సాగించారు. ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిన కూడా తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు ఆగడం లేదు. దీన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ పోలీసులు మామూలకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ములకలచెరువు లో జరిగిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో సూత్ర పాత్రధారుడు డంపు బయటపడగానే విదేశాలకు పారిపోయి ఎంచక్కా అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ గా చేసుకొని వారిపై మద్యం కేసులు బనాయించి అరెస్టు చేయించి జైల్లో మగ్గిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ములకలచెరువు లో తయారైన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో తంబళ్లపల్లి బహిష్కృత టీడీపీ నేత దాసరపల్లి జయచంద్రారెడ్డి పై ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని నేతలే విదేశాలకు పారిపోయేందుకు సహకరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం జరిగి సుమారు ఐదు నెలలవుతున్న ఆయన్ని భారత్ కు రప్పించే ప్రయత్నం చేయకపోవడంతో పలు అనుమానాలు తావిస్తోంది. అరకొర తనిఖీలతో ఎస్సైజ్ పోలీసులు మమ అనిపిస్తున్న వైనం..___________________________అరకర తనిఖీలతో ఎక్సైజ్ శాఖ పోలీసులు తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారని ఇంత జరిగిన తంబళ్లపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు సాగుతూనే ఉన్నాయని దీన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ నిద్దురలో జోగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. రంగసముద్రం గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహించేందుకే ప్రత్యేకంగా ఓ రూమును బాడుకకు తీసుకుని మద్యం విక్రయాలు చేపడుతున్నాడని ఇంత పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు జరుగుతున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని వాళ్లకు కావాల్సిందల్లా మామూలు మాత్రమేనని రంగసముద్రం గ్రామస్తులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం విక్రయాలు ఏరులై పారుతున్నాయని ఎక్కడ చూసిన బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. ములకల చెరువులో ఘటన జరిగిన నెలరోజుల పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మళ్లీ యధాతధ గా బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు ఊపందుకొంటున్నాయి. ఇకనైనా ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రమత్తు వీడి మామూళ్లకు మరగకుండా గ్రామాలను సందర్శిస్తూ బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు సాగకుండా అరికట్టాలని చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తానని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకున్నారు. అధికారాన్ని చేపట్టాక స్వర్ణాంధ్రప్రదేశ్ పోయి మధ్యమంధ్రప్రదేశ్ మార్చేశారని వైసీపీ శ్రేణులు అవాకులు చవాకులు పేల్చుతున్నారు. ~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News