Monday, March 23, 2026

మసీదులో ప్రత్యేక ప్రార్థనలు..ముఖ్య అతిథిగా హాజరైన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త..ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలగాలని నిస్సార్ అహ్మద్ ఆకాంక్ష..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 05 ~అన్నమయ్య జిల్లా :-: ముస్లిం మైనార్టీ సోదరులకు పవిత్రమైన శుక్రవారం నాడు మదనపల్లి పట్టణ పరిధిలోని అయోధ్య నగర్ లో గల ముస్లిం మైనార్టీల పవిత్రమైన ప్రార్థన మందిరం మస్జిద్ – ఎ – ఇజ్రత్ అబుబకర్ సిద్దిక్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు ముస్లిం మైనార్టీ సోదరుల ఆహ్వానం మేరకు మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మజీద్ ప్రాంగణం వద్దకు విచ్చేసిన నిస్సార్ అహ్మద్ ను ముస్లిం మైనార్టీ సోదరులు ఏకమై దుశ్శాలువలు కప్పి పూల బొకే అందించి స్వాగతం పలికారు. తోటి ముస్లిం సోదరులను ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనానంతరం ముస్లిం మైనార్టీ సోదరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పవిత్ర శుక్రవారం రోజుల వివిధ మసీదులో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం అలవాయితీగా వస్తా ఉందని తోటి ముస్లిం మైనార్టీ సోదరులతో ఆధ్యాత్మిక భావాలను పంచుకోవడం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయని ముస్లింలు పడుతున్న ఇబ్బందులు మన దృష్టికి వస్తాయని వాళ్ల సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయచ్చని నిస్సార్ అహ్మద్ తెలిపారు. మసీద్ అభివృద్ధిపై మత పెద్దలను అడిగి విచారించారు. ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తానని ఎవరు ఇబ్బందుల్లో ఉన్న తన వద్దకు నేరుగా వచ్చి కలవచ్చని సాధ్యమైనంతగా పరిష్కారం చేస్తానని ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలగాలని నిస్సార్ అహ్మద్ సూచించారు. నిస్సార్ అహ్మద్ తో కలిసి ప్రార్థనలో ఎస్. ఖాదర్ బాషా, జీలానీ బాషా, అమానుల్లా, మహమ్మద్ వల్లి, యూనస్, హఫీజ్, ఖలీల్, రోషన్, నూర్, మొహిద్దీన్, షానవాజ్, ఫక్రుద్దీన్, ఎన్. నవాజ్ అలీ ఖాన్, ఫక్రుద్దీన్, హబీబ్, నాసిర్, రియాజ్, ఖిజార్, అబ్దుల్ ఖాన్, యాసీన్, అబ్దుల్ మత పెద్దలు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News