నేటి సాక్షి మహబూబాబాద్ (భూక్యా రవి నాయక్) నవంబర్ 18మహబూబాబాద్ జిల్లా పర్యటన అనంతరం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, మరిపెడ మండలం బీచ్‌రాజుపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గారి స్వగృహంలో ఆయన భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్, మహబూబాబాద్ మాజీ ఎంపీ & జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత పాల్గొన్నారు. మండల బీఆర్ఎస్ నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు కూడా వెంట ఉన్నారు.




