—- మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గము ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి …
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్) రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధి, రాజేంద్రనగర్ పూలే సర్కిల్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు సందర్బంగా పూలే ఉత్సవ కమిటీ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో జరిగిన జ్యోతిరావు పూలె జయంతి వేడుకల్లో పాల్గొని మహనీయునికి పూల మాలవేసి జయంతి నివాళులర్పించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము శాసన సభ్యురాలు *సబితా ఇంద్రారెడ్డి* ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి సందేశం అనుసారం…. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగానే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కూడా నేతలు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే కి ఘన జయంతి నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. మహాత్మ జ్యోతి రావు పూలే కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి ప్రతి మహిళకు ఉన్నతమైన చదువులు చదవాలనే లక్ష్యంతో ఆ మహోన్నత వ్యక్తి అనేక పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు. ఆయన పోరాటాల ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు హక్కులు రావడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ దేశంలో కుల వివక్షతను రూపుమాపడం జరిగిందని సబితా ఇంద్రారెడ్డి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ , స్థానిక కార్పొరేటర్ . అర్చన జయప్రకాష్ జ్యోతి రావు పూలె కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మైలార్డెవపల్లి డివిజన్ అధ్యక్షుడు శ్రీ. వెంకటేష్ , అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీ పోరెడ్డి ధర్మారెడ్డి , సీనియర్ నాయకులు శ్రీ. కొలన్ సుభాష్ రెడ్డి డి. రమేష్ ముదిరాజ్ కే.రాజశేఖర్ రెడ్డి పి. జయ ప్రకాష్ జె. చిత్తారి.సోమా శ్రీనివాస్ నోముల రాము యాదవ్, అక్కేం రఘు యాదవ్ పచ్చ శ్రీనివాసులు మహేందర్ ముదిరాజ్ అనుబంధ విభాగాల అధ్యక్షులు ముఖ్య నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు అన్ని అనుబంధ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.

