(నేటి సాక్షి)జగద్గిరిగుట్టప్రతి సంవత్సరం కార్తీక మాసం సమీపించగానే జగద్గిరిగుట్ట ప్రాంతం భక్తి సంద్రమై మారుతుంది. ఆ భక్తి ప్రవాహంలో 12వ మహా పాదయాత్రకు శనివారం ఉదయం ఘనంగా శ్రీకారం చుడుతున్నారు శివస్వాములు. కొలుకుల సత్యనారాయణ (బండి) శివ గురు స్వామి ఆధ్వర్యంలో, మగ్దుమ్‌నగర్ శివ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఈ భక్తి ప్రయాణం ఆరంభం కానుంది.గత 11 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ పాదయాత్రకు జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్ శివ స్వామి ముందుండి ప్రతి సంవత్సరం సుమారు 70 మంది శిష్యగణంతో పాల్గొంటున్నారు. కార్తీకమాసం మొదటి రోజు మాలధారణతో ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శివస్వాములు అయ్యప్ప స్వాములకు, శివునికి భక్తి సేవలు నిర్వహిస్తూ ప్రజల్లో ధార్మిక విలువలను పెంపొందిస్తున్నారు.- ఆరంభ రోజు నుంచే ఆధ్యాత్మిక వాతావరణంమొదటి రోజు ఉదయం 4:30 గంటలకు జగద్గిరిగుట్ట దేవస్థానంలో శివుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివస్వాముల చేత కొబ్బరికాయలు కొట్టించి “ఓం నమః శివాయ” జపధ్వనులతో పాదయాత్ర ప్రారంభం అవుతుంది.ప్రథమ దర్శనంగా బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆశీస్సులు పొంది మధ్యాహ్నం అఫ్జల్గంజ్ ఆశ్రమంలో బిక్ష కార్యక్రమం ముగించుకుని రాత్రి పహాడీ షరీఫ్ ఆశ్రమం వద్ద బస చేస్తారు.- శివస్వాముల ఉత్సాహం – పాదయాత్ర విజయానికి బలం“ఈ పాదయాత్రను మహోత్సవంగా నిలిపేది శివస్వాముల అంకితభావమే” అని 126వ డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ శివ గురు స్వామి తెలిపారు. ప్రతి ఏడాది పాల్గొనేవారి సంఖ్య పెరుగుతూ, ఈ యాత్ర ఒక ఆధ్యాత్మిక జాతరగా మారిందని పేర్కొన్నారు. ప్రాంతం నలుమూలల నుంచి శివస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్ర వైభవాన్ని మరింత పెంచుతున్నారని ఆయన అన్నారు.పది రోజుల పాదయాత్ర – ఆధ్యాత్మిక మార్గసంచరణ1వ రోజు: జగద్గిరిగుట్ట నుండి పహాడీ షరీఫ్ ఆశ్రమం2 వ రోజు: పహాడీ షరీఫ్ నుండి కందుకూరు ఫంక్షన్ హాల్3వ రోజు: కందుకూరు నుండి ఆమనగల్ ఫంక్షన్ హాల్4 వ రోజు:ఆమనగల్ నుండి కల్వకుర్తి హనుమాన్ దేవస 5వ రోజు : కల్వకుర్తి నుండి హాజీపూర్ హనుమాన్ దేవస్థానం 6వ రోజు: హాజీపూర్ నుండి మన్ననూరు చెక్‌పోస్ట్ 7 వ రోజు: మన్ననూరు నుండి వత్వర్లపైయ్ ప్రభుత్వ గురుకుల పాఠశాల 8వ రోజు: వత్వర్లపైయ్ నుండి దోమలపెంట రామాలయం 9వ రోజు: దోమలపెంట నుండి అటకేశ్వరం ఆశ్రమం – పాలధార – పంచదార10వ రోజు: అటకేశ్వరం ఆశ్రమంలో ఇరుముడి సమర్పణతో పాదయాత్ర సమాప్తి- ఇరుముడి సమర్పణతో యాత్ర ముగింపు – ఆధ్యాత్మిక శిఖరంచివరి రోజు అటకేశ్వరం ఆశ్రమంలో స్వాములందరూ ఇరుముడి సమర్పణ చేసి పాదయాత్రను ముగించుకుంటారు. ఈ పది రోజుల ప్రయాణం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా శివభక్తులను మరింత పటిష్టం చేస్తుంది. భక్తి, సేవ భావనలతో శ్రీశైలం వైపు సాగుతున్న ఈ నడకయాత్ర ప్రాంతీయులలో ఆధ్యాత్మిక స్పూర్తిగా నిలుస్తోంది.





