*నేటిసాక్షి,నల్లబెల్లి* మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శశిర ఋతువు పాల్గొనమాస బహుళ తదియ శుక్రవారం సంకటహర చతుర్థి సందర్భంగా రాజరాజేశ్వరుడు మహామృత్యుంజయనిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ అర్చకులు పెందోట మురళీమోహన్ ఆచారి స్వామివారని మహా మృత్యుంజయునిగా అలంకరించడంతోపాటు బాలా త్రిపుర సుందరీ దేవి. పార్వతి మాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయములో కొలువుదీరిన సకల దేవతలకు సైతం ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. సంకటహర చతుర్థి సందర్భంగా భక్తులు వేకువజాము నుండి దేవతామూర్తులను దర్శించుకున్నారు.





