నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 4అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామపంచాయతీ, బోయకొండ యానాదిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. తమ్ముడు వేట కొడవలితో అక్కపై దాడి చేయడంతో గంగులమ్మ పరిస్థితి విషమంగా మారింది. ఈ దాడిలో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేతి .బొటనవేలు తెగిపోయింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై నాగేశ్వరరావు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





