పోషణ్ అభియాన్ పథకం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్
నేటి సాక్షి – కోరుట్ల
జగిత్యాల జిల్లాలోని మహిళా అబివృద్ది, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ‘పోషణ అభియాన్ పథకం’ ద్వారా గ్రామా స్థాయి ,మండల స్థాయి ,జిల్లా స్థాయిలలో పొషణ్ అభియాన్ ఫై పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆగస్టు మాసం మొదటివారంలో తల్లిపాల వారోత్సవలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం తల్లిదండ్రులు తమ బిడ్డకు అత్యుత్తమ సంరక్షణను అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు,, మరియు ప్రసవం, అలాగే ప్రసవానంతర కాలంలో. పిల్లల కోసం కొనసాగుతున్న సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనది,తల్లులు మరియు శిశువులు ఇద్దరికీ సరైన సంరక్షణ ఉందని నిర్ధారించుకోవడంలో,తల్లిపాలను అందించడంలో చాలా మంది పాత్ర ఉంటుంది .వివిధ స్థాయిలలో. మహిళలకు ఆరోగ్య సేవ కార్యక్రమాలు మరియు సమాజం నుండి సరైన మద్దతు వారికి అవసరం ఉంటుంది .
ఈ నేపథ్యంలో, ఈ సంవత్సరం ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ (WBW 2024) అంతరాలు తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుదాం అనే భావనతో ఈ సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రసూతి ఆసుపత్రులలో ప్రసవించే తల్లులకు సహకరించి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రోత్సహించాలని సంవత్సరం – ఆగస్టు మాసములోని మొదటివారం తేది : ( 1-7 వ తేది వరకు ) నిర్దిశించిన ప్రణాళిక ప్రకారం జిల్లాలోని పలు కార్యక్రమాలని నిర్వర్తించడం జరుగుతుంది.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అధికారులకు ఈరోజు జిల్లా సమన్వయ సమావేశం జరపడం జరిగినది,ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,తల్లి పాల ప్రాముఖ్యత పైన గ్రామా స్థాయి నుండి అందరికి అవగాహన కలిపించాలని ఆదేశించారు , ఈ కార్యక్రమాలపై అధికారులకు దిశ నిర్దేశం చేసారు ఈ సందర్బంగా జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భోనగిరి నరేష్ మాట్లాడుతూ ఆగస్టు ( 1-7 వ తేది వరకు) గ్రామ స్థాయిలో,మండల స్థాయిలో ,మరియు పట్టణ స్థాయిలో,వార్డు స్థాయిలో అంగన్ వాడి టీచర్లు , ఆశ వర్కర్లు కలిసి గ్రామాలలో ఉండే గర్బిణి లు మరియు పిల్లలకు గృహ సంధర్శనల ద్వారా తల్లి పాల ప్రాముఖ్యత పైన అవగాహనా కలిపించడం జరుగును,మరియు ప్రభుత్వ ,ప్రైవైట్ ,ఆసుపత్రులను సందర్శించి తల్లి బిడ్డల సంరక్షణ పద్దతులను మరియు బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తారు అని చెప్పడం జరిగినది , పిల్లలకు ఆహారం అందించే పద్దతులపై అవగహన కలుగచేస్తారని అన్నారు ,అదేవిధంగా పిల్లల లోప పోషణ గురించి ,పిల్లలో పోషణ స్థాయిని పెంపొందించడానికి తల్లలులకు సూచించడం జరుగుతుందని చెప్పారు. బిడ్డకు తల్లి పాలు ఇవ్వడంలో అంతరాలు తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుడం జరుగుతుందని చెప్పారు . ____

