నేటి సాక్షి సిరిసిల శివకుమార్* నెహ్రు నగర్ ఏరియాలో ఐద్వా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు . నిరంతరం మహిళా హక్కుల కొరకు పోరాడుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం లో మహిళలందరూ సభ్యులుగా చేరి సంఘం బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈరోజు దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది ఇంటి నుండి బయటకు వెళ్ళితే మళ్ళీ ఇంటికి చేరుకునే దాకా ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతి మహిళ భయపడుతూ జీవిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న కూడా మహిళలు ఒంటరిగా స్వతంత్రంగా తిరిగే పరిస్థితి రాలేదు మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన నిర్భయ చట్టం లైంగిక వేధింపుల చట్టం వరకట్నం వేధింపుల చట్టం గృహహింస చట్టం ఇవి ఏమి మహిళలకు రక్షణ కల్పిస్తా లేవు దేశంలో అధికారిక గణింకాల లెక్కల ప్రకారంరోజుకు గంటకు ఇద్దరు మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురవుతుంది ప్రతి 34 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతుంది పని ప్రదేశాల్లో భద్రత లేదు సమాన పనికి సమాన వేతనం అమలు కాదు అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందుతున్న పురుషులతోటి పోటీపడి సమానంగా పనిచేస్తున్న కూడా మనువాద భావాజాలం వలన అణిచివేయాలని చూస్తున్నారు మహిళను మనిషిగా చూసే సమాజం రావాలని అప్పుడే మహిళకు తగిన గౌరవం లభిస్తుంది . అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి జవ్వాజి విమల సూరం పద్మ . ఆడెపు రజిత గడప మాధవి నేల పెళ్లి శ్యామల గురజాల మమత మల్లారపు నరసవ





