మహిళలకు రుణాలు త్వరగా మంజూరు చేయండి ప్రతిపాదనలు అందించిన వెంటనే రుణాలు ఇవ్వండి బ్యాంక్ మేనేజర్ ను కోరిన డిఆర్డిఏ పిడి శోభన్ బాబు నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) రామచంద్రాపురం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల రూపొందించిందని అందులో భాగంగా రామచంద్రాపురం మండలంలో మహిళలను వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సహకరించి విరివిరిగా రుణాలు మంజూరు చేయాలని డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు కోరారు. ఆయన రామచంద్రాపురం మండలంలో పర్యటించారు. ఏపీజీబీ ఆర్ సి పురం, ఏపీజీబీ కుప్పం బాదూరు బ్రాంచ్లకు మేనేజర్లతో చర్చించారు. ముఖ్యంగా మహిళ స్వయం సహాయక సంఘాల కు నిర్దేశించిన టార్గెట్ ప్రకారం బ్యాంకు లింకేజీ, ఉమెన్ ఎంటర్ప్రైజెస్ పీఎంఈజీపీ, పీఎం ఎఫ్ఎంఈ రుణాల మంజూరు విషయంగా,బ్రాంచ్ మేనేజర్లలను కోరారు. స్వయం సహాయక సంఘ సభ్యులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేసి ప్రభుత్వ లక్ష్యానికి సహకరించాలని బ్యాంక్ మేనేజర్లను ఆయన కోరారు. ప్రభుత్వం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ పెన్యూర్ కింద మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని ఆయన బ్యాంక్ మేనేజర్లకు తెలియజేశారు.కాబట్టి బ్యాంకర్స్ కూడా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మహిళా వ్యాపారవేత్తలకు మండలానికి నిర్దేశించిన టార్గెట్ 230 మందికి గుర్తించిన ఔత్సాహిక వ్యాపారవేత్తలను తయారు చేసే దిశలో బ్యాంకర్స్ ప్రముఖ పాత్ర వహించాలన్నారు .ఈ కార్యక్రమంలో ఏపీజీబీ ఆర్ సి పురం బ్రాంచ్ మేనేజర్ రాధాకృష్ణ , కుప్పం బాదూరు బ్రాంచ్ మేనేజర్ రాము , ఏపిఎం గురుమూర్తి, సీసీ సుధాకర్ పాల్గొనడం జరిగింది.