నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కావలసిన చీరలను అందించి వారికి ఆత్మగౌరవాన్ని పెంచామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి తెలిపారు. ఆదివారం మహిళ సంఘం భవనం ఆవరణలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్, మాజీ సర్పంచ్ అల్లూరి మానసతో కలిసి మండల అధ్యక్షుడు తూం జలపతి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తూం జలపతి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మహిళలపై ఉన్న గౌరవంతో వారు నచ్చి మెచ్చే చీరలను నేయాలన్న సంకల్పంతో చీరల తయారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.మహిళల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మహిళ గ్రూపులకు తక్కువ వడ్డీకే బ్యాంకుల్లో రుణాలు అందజేస్తున్నామని చెప్పారు. వేల సంఖ్యలో మహిళ గ్రూపులు బ్యాంక్ ల్లో రుణాలు తీసుకొని ఆర్థికంగా ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మొదటి సంతకం మహిళల ఉచిత బస్సు ప్రయాణం చెయ్యడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఎంతగానో గౌరవిస్తుందన్నారు. అందుకోసమే మీరు మెచ్చే నాణ్యమైన చీరలను తయారు చేయించి మహిళలకు ప్రభుత్వం పంపిణీ చేసి సమాజంలో మహిళల ఆత్మ గౌరవం పెంచామన్నారు. రాబోయో రోజుల్లో కూడా మహిళల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు తీసుకస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఓఏ పిడుగు రజిత, జక్కు మోహన్, జక్కుల లక్ష్మీ నర్సయ్య, జక్కు లింగారెడ్డి, లకవత్ బాలు, మహిళ సంఘల సభ్యులు పాల్గొన్నారు.





