నేటి సాక్షి (భూమయ్య )ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమం పైన..సచివాలయం నుండి బుధవారంఅన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా..ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్బంగా.. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించుకున్నామన్నారు ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు ఒక పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారుమహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టండన్నారుమహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాదు.. వాటికి మహిళలను యజమానులను చేశామన్నారు స్కూల్స్ లో యూనిఫారం కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామన్నారుఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నాం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు కోటి మంది మహిళలలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారుపూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందన్నారుమార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందన్నారు కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు వీసీ అనంతరం *కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో… మహిళా సమాఖ్య వారితో మాట్లాడుతూ…… జిల్లా లో ఉన్న 13 వేల స్వయం సహాయక సంఘాలలో 1, లక్ష 35 వేల మంది సభ్యులు ఉన్నారని. ఇందిరమ్మ చీరల పంపిణీ జరగాలన్నారు.ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్ని పండుగ వాతావరణం లో జరుపుకోవాలన్నారుమండల స్థాయి, గ్రామ స్థాయి లో ఒక కమిటీ ని ఏర్పాటు చేసి చీరల పంపిణి సజావుగా జరగాలన్నారుప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అధికారిని నియమిస్తా మన్నారుప్రతీ గ్రామం లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను,ప్రతీ గోదాం కి ఇంచార్జి లను పెట్టాలన్నారు చీరల పంపిణీ చేయగానే సంబంధిత మహిళ అక్విటెన్స్ ను, ఫేషియల్ రికగ్నైజేషన్ వివరాలని పంపించాలని జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులకు కలెక్టర్ తెలిపారు ఈ వీసీ లో డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య డీపీఎం లు, ఏపీఎం లు, జిల్లా,మండల సమాఖ్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు





