నేటి సాక్షి;బాపట్ల జిల్లా (పర్చూరు)మహిళా సంఘాల స్ఫూర్తితో దివ్యాంగుల గ్రూపులు కూడా తమ స్వయం సంఘాలను బలోపేతం చేసుకుని ఆర్థిక విప్లవం దిశగా ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా చిన్నగంజాం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో ఆయన ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి అవసరాలు, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో అత్యంత పట్టుదలతో జీవితం గెలిచే యోధులు అని, వారి ఆర్థిక–సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం పోషించే పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. స్వయం సహాయక సమూహాల తరహాలో దివ్యాంగులకు ప్రత్యేక మద్దతు, రుణాలు, శిక్షణలు, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం మరింత విస్తృతంగా అందించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.దివ్యాంగుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశం ఉపాధి, విద్య, ఆరోగ్యం, పింఛన్ల పెంపు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.గ్రామ స్థాయిలో దివ్యాంగులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగేలా వారిని నమ్మి వారికి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ, ఆర్థిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. దివ్యాంగులు తయారు చేసిన వస్తువులను అభినందిస్తూ, ప్రభుత్వ సహకారంతో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి విశిష్టతను చాటుకుంటం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. దివ్యాంగులకు ఉపయోగపడే వస్తువులు అందించడం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దివ్యాంగులకు రూ. 6వేల పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. పెరిగిన పెన్షన్ తో రోజువారి ఖర్చులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి లవన్న మాట్లాడుతూ దివ్యాంగులు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా బడ్డీ కొట్టు పెట్టుకోవటం, పడ్లు, కూరగాయలు వండి చిన్నచిన్న వ్యాపారాలు చెయ్యటం, ఆటో నడపడం వాటి మీద వ్యాపారాలు చేయటం, గ్రామాల్లో ఇంటర్నెట్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం ఇలా ఎన్నో రంగాల్లో దివ్యాంగులు రాణించడం గర్వించదగ్గ విషయం అన్నారు.*అవసరమైన పరికరాల పంపిణీ – లబ్ధిదారులకు రుణాల మంజూరు*కార్యక్రమంలో పలువురు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే వివిధ సహాయక పరికరాలను పంపిణీ చేశారు. అందులో భాగంగా చేతి కర్రలు,నడుం బెల్టులు,వీల్ చెయర్లు,మెడ పట్టీలు,మోకాలు పట్టీలు,రైల్వే పాసులు,నిత్యవసర సరుకుల కిట్లుఅలాగే స్వయం ఉపాధి కోసం 10 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.20 లక్షల విలువైన రుణాలు అందజేశారు. ఈ రుణాలు దివ్యాంగులు ఆత్మనిర్భరులుగా మారేందుకు ఎంతో సహాయపడతాయని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.*ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్*కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వికలాంగులకు పెన్షన్ పెంచడం మొదలు ఎన్నో గొప్ప కార్యాలు చేయడం జరిగిందని తెలిపారు.మండలంలో వికలాంగులను గుర్తించి వారికి మేలు చేయాలని ఇంతమందికి ఇన్ని రకాల పరికరాలు ఇవ్వడం గొప్ప విషయమని మండల వెలుగు అధికారులను అభినందించారు.ఏ యం సి చైర్మన్ గుంజి వెంకట్రావు మాట్లాడుతూ వికలాంగులకు వారికి అవసరమైన పనిముట్లు ప్రభుత్వం ద్వారా మరియు దాతలు ద్వారా ఇవ్వటం గౌరవించదగ్గర విషయం అని తెలిపారు.30 దశాబ్దల నుంచి తీవ్ర సమస్యగా ఉన్న రాజుబంగారుపాలెం- పెదగంజం గ్రామాల మధ్య వారధి నిర్మాణం, ఎమ్మెల్యేగా సాంబశివరావు ఎన్నికైన వెంటనే వంతెన నిర్మాణం చేశారని పేర్కొన్నారు . కష్టాలు వస్తే నేనున్నానని అని ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే ఏలూరి అన్నారు. పొగాకు పంట కొనుగోలు విషయంలో సీఎం చంద్రబాబు అధికారులను, మంత్రులను ఒప్పించి పొగాకు పంట కొనుగోలు చేయించిన ఒకే వ్యక్తి ఎమ్మెల్యే ఏలూరి అన్నారు.ఏపీఎం సుబ్బారావు మాట్లాడుతూ మండలంలో 450 దివ్యాంగులు ఉన్నరని, వీరందరికీ లోన్స్ ఇప్పించటం జరిగిందని, గత ఏడాది CIF ద్వారా 30 లక్షల రూపాయల లోన్స్ ఇవ్వటం జరిగిందని తెలిపారు.మండలంలోని ఉన్న వికలాంగులందరికీ అవసరమైన పనిముట్లు 100% ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయుడు హనుమంతరావు, ఆజాద్, సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డి, కొండలు, లక్ష్మి, సంధ్య, రామాంజనేయులు, సత్యం, సందు శీను, తదితరులు పాల్గొన్నారు.





