Friday, March 20, 2026

మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.

నేటి సాక్షి వికారాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఆర్థిక అభివృద్ధి సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం జిల్లాలో 9,232 స్వయం సహాయక సంఘాల మహిళలకు 7.38 కోట్ల రూపాయలు జులై , 2025 వరకు వడ్డీ లేని రుణాలు ముఖ్య మంత్రి చేతుల మీదుగా విడుదల చేయగా మంగళవారం స్వయం సహాయక సంఘాల మహిళల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. పరిగి 2781 సంఘాలకు 2.23 ,కోడంగల్ 1,101 సంఘాలకు 0.84, తాండూర్ 2,113సంఘాలకు 1.77, వికారాబాద్ 2,664 సంఘాలకు 2.20 కోట్ల రూపాయలు , నియోజకవర్గాలలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు జమ చేయడం జరిగిందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News