Wednesday, February 18, 2026

మహిళా హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు: వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా.

నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ వికారాబాద్ ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, వెల్లడిస్తూ, నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చేయడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు. 2024లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులుమామిడి గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కాగా, తిమ్మాపురం మాధవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి వికారాబాద్ టౌన్ ఎస్‌ఐ అనిత క్రైమ్ నంబర్ 30/2024 కింద ఐపిసి సెక్షన్లు 302, 376, 379, 404, 201 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు భాదితురాలు చేవెళ్ళ గ్రామానికి చెందిన ఎర్రోల్ల అనుసుజా గా గుర్తించినారు టెక్నికల్, శాస్త్రీయ ఆధారాలతో నిందితుడు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి గ్రామానికి చెందిన తలారి బాబు (అలియాస్ అవుసుపల్లి బాబు, 32 ఏళ్లు) అని గుర్తించి అరెస్ట్ చేసి, పక్కా ఆధారాలతో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిహెచ్. చంద్ర కిషోర్ (I అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి, వికారాబాద్) నిందితుడిపై నేరం రుజువు కావడంతో సెక్షన్ 302 ఐపీసీ (హత్య) కింద జీవితకాల కారాగార శిక్ష రూ. 5,000/- జరిమానా, సెక్షన్ 201 ఐపీసీ (ఆధారాల చెరిపివేత) కింద 7 ఏళ్ల జైలు శిక్ష మరియు రూ. 2,000/- జరిమానా, అలాగే సెక్షన్ 404 ఐపీసీ (సొత్తు అపహరణ) కింద 3 ఏళ్ల జైలు శిక్ష రూ. 2,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన దర్యాప్తు అధికారులు ఏ. అంజనేయులు, టి. శ్రీను, ఏ. నాగరాజు, బి. భీమ్ కుమార్ (అప్పటి వికారాబాద్ ఇన్‌స్పెక్టర్లు) ప్రస్తుత ఎస్.హెచ్.ఓ కె. రఘు కుమార్ గారిని జిల్లా ఎస్పీ అభినందించారు. అలాగే, కోర్టులో బలమైన వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి మెరాజ్ ఫిర్దౌస్ గారిని, సాక్ష్యాధారాల సమర్పణలో విశేష కృషి చేసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్లు ఎల్. నరేందర్ (ASI), జి. మాణిక్ ప్రభు మరియు లైజన్ ఆఫీసర్ ఎస్. నిరంజన్ గౌడ్ గారిని ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News