– నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా :-: ఆమె చావుకు కారకులెవరు. ఈ పాపం ఎవరిది. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసమని వచ్చి ఆస్పత్రి బయట పడుకొని చలికి తట్టుకోలేక ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన శనివారం మదనపల్లి లోని జిల్లా ఆస్పత్రిలో వెలుగు చూసింది. ఈ విషాదకర ఘటనకు కారకులెవరని ఈ పాపం ఎవరిదని ఎవరిని నిందించాలని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక వివరాల్లోకెళ్తే తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని బలకవారిపల్లి గ్రామానికి చెందిన రాగిణి వెంకటప్ప భార్య మల్లమ్మ ఆరోగ్యం సరేలేక శుక్రవారం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చింది. తాత్కాలిక వైద్యం పొందినట్లు చేతికి క్యాన్ల కలిగుంది. ఆస్పత్రి లోపల పండుకోవాలంటే సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆమె ఆస్పత్రి ఆరు బయట స్లాబు కింద పడుకొని రాత్రంతా చలికి తట్టుకోలేకపోయింది. శనివారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది లేపే ప్రయత్నం చేశారు. ఆమెలో ఎలాంటి స్పందన లేదు. ఆ మహిళ చనిపోయిందని గుర్తించారు. వెంటనే అత్యవసర విభాగంలోనికి తీసుకొచ్చి పరీక్షించిన వైద్యులు ఆమె రాత్రే చనిపోయిందని నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంత దారుణ ఘటన జరగడానికి ఆసుపత్రి ఉన్నతాధికారులు, కొందరి ఉద్యోగులే కారణమని వైసీపీ శ్రేణులు యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రి తమ సొంత జాగిర్ల భావించి కొందరు రోగులను ఆసుపత్రి లోపల పడుకోవడానికి అనుమటించడం లేదనే ఆరోపణలున్నాయి. దానికి తోడు రాత్రంతా చలిలో ఆరు బయట పడుకోవడం వల్ల ఆమె ప్రాణాలు పోగొట్టుకుందని ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కొందరి సిబ్బంది ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న తీరుపై ఆసుపత్రి సూపరింటెంట్, ఆర్ ఎమ్ఓ ల దృష్టికి తీసుకెళ్లారు. రోగుల పట్ల కనికరం లేకుండా కఠినంగా వ్యవహరించడంతోనే మల్లమ్మ మృతి చెందిందని ఆమె మృతికి సిబ్బందే కారణమని మదనపల్లి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తో పాటువైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఏ రోజు జగన్ అధికారం కోల్పోయాడో ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యం డీలా పడిందని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. పేదలకు ఉచిత వైద్యం అందడం లేదని కార్పొరేట్ ఆసుపత్రులకు వత్తాసు పలుకుతున్న కూటమి ప్రభుత్వ వైఖరితో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకునే స్తోమత లేక ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాణాలు విడుస్తున్నారని గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందకపోతే తక్షరమే చర్యలు తీసుకునేవారని కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని దీంతో కొంత మంది ప్రభుత్వ వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేద ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని వైసీపీ యువజన విభాగ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.~~~~~~~~~~~~~~~~~~

