నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) *రామచంద్రపురం* మహిళ రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి ఎన్ శోభన్ బాబు అన్నారు శనివారం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా రైతులతో సమావేశం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సహకారంతో (ఎఫ్ పి ఓ) ఏర్పాటు కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఎఫ్. పి. ఓ ఏర్పాటు చేయడం వల్ల రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించుకోవచ్చు, రైతులు పండించే పంటలు,కాయగూరలకు మార్కెటింగ్ కల్పించుకోవాలి రైతులకు కావాల్సిన యాంత్రికరణ వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు, రైతులకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణలు పొంది తక్కువ పెట్టుబడి తో అధిక ఆదాయం వచ్చే పంటలను సాగు చేసి అధిక దిగుబడులు గణనీయంగా పెరుగుతోందని అన్నారు, దీనివల్ల దళారీ వ్యవస్థను పూర్తిగా అరికట్టవచ్చును. కాబట్టి ప్రభుత్వం కల్పించిన ఎఫ్.పి.ఓ నందు మండలం లో ఉన్న మహిళా రైతులు ( ఎఫ్.పి. జి) వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు గా ఏర్పాటు చేసుకొని ఎఫ్ .పి. ఓ తో రైతులు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో మహిళలు ఏపిఎం గురుమూర్తి, ఎఫ్. పి. ఓ అధ్యక్షురాలు లక్ష్మి,మహిళా రైతులు, సి సి లు పార్వతమ్మ, సుధాకర్ అరుణ అకౌంటెంట్ స్వర్ణలత, తదితరులున్నారు





