నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ తరుపున మేము విన్నమించేది హెచ్చరించేది ఏమనగా మా మహేశ్వరం మండలం లోని రైతుబందుకు అర్హలైన రైతుల మొత్తం 13,470 మంది గాను వ్యవసాయ యోగ్యమైన భూమి 19,817 ఎకరాల భూమి కలదు. గత ప్రభూత్వం ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా అంటే ఖరీప్, రవీ పంటలకు గాను క్రమం తప్పకుండా ఎకరానికి రూ 5,000/- చొప్పున రైతుల ఖాతాలో జమచేయడం జరిగింది. కాని ఈ ప్రభత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుండి ఏ ఒక్క రైతుకు రైతుబందు ఇచ్చిన పాపాన పోలేదు. మరియు ఎలాంటి ఆంక్షలు లేకుండ మొత్తం రైతులకు రైతుబందు ఇస్తానని ప్రగల్బాలు పలికి మా యొక్క మహేశ్వరం మండలాన్ని మినహాయిస్తూ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పడం హస్యాస్పందంగా ఉంది..
ఈ పభూత్వం రైతు వ్యతిరేక విదానాలను కొనసాగిస్తే రెతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులను, కార్యకర్తలను అధికారులను గ్రామాలలోతిరుగనివ్వబోమని హెచ్చరిస్తూ మహేశ్వరం మండలం లోని మొత్తం 13.470 మంది రైతుల ఖాతాలకుగాను,19,817 ఎకరాలకు రైతుబందు వేసేవరకు యావత్ మహేశ్వరం మండల రైతుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటామని ఒకవేళ మీరు ఇలాంటి రైతు వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభూత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ పథకం ద్వారా కేవలం మహేశ్వరం మండల రైతులకు వందల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. ఈ రోజున రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తూ ఈ రోజు మొదలుకొని రెండు రోజలలలో రైతుబందు మొత్తాన్ని రైతుల ఖాతాలో వేయని మెడల వ్యవసాయ కార్యాలయాన్ని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మహేశ్వరం రైతుల పక్షాన హెచ్ఛరిస్తున్నాము…
కార్యక్రమంలో
పి.ఏ.సి.ఎస్ వైస్ చైర్మన్ దేవరపల్లి.వెంకటేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంగోత్.రాజు నాయక్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోళ్ల.చెంద్రయ్య ముదిరాజ్, పోతర్ల,అంబయ్య, స్వర్ణగంటి.ఆనందం, మునగపాటి. నవీన్, కొత్తపల్లి.దేవరం, దేవుల నాయక్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఆదిల్ అలీ, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ కాడమోని.ప్రభాకర్, మాజీ సర్పంచులు కొర్పోల్ ప్రభాకర్ రెడ్డి, బండారి.పాండు, సిల్వా రెడ్డి, మాజీ ఎంపీటీసీలు రాయప్ప, మాజీ ఉపసర్పంచ్ నర్శింగ్, గ్రామ శాఖ అధ్యక్షులు దుడ్డు.కృష్ణ యాదవ్, శివ, బొల్లు శ్రీశైలం, వంగూరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు…

