నేటి సాక్షి 02 పాములపాడు:- పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామం నుండి భారీగా కార్యకర్తలతో అల్లూరు కి బయలుదేరి అక్కడ నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ మాండ్ర.శివానంద రెడ్డి, ఆయన సతీమణి మాండ్ర.ఉమాదేవి, నందికొట్కూరు నియోజకవర్గం శాసనసభ్యులు గిత్త.జయసూర్య లకు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు తరఫున వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ కలిసి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు చేతికి అందించి నూతన సంవత్సరం-2026 శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగపూర్ నుండి అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో, మరియు భవిష్యత్తులో మన పెద్దలు మాండ్ర.శివానందరెడ్డి, ఆయన సతీమణి మాండ్ర.ఉమాదేవి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి లు మరియు మా వేంపెంట గ్రామ, నియోజవర్గ, మన రాష్ట్ర పరిధిలందరూ రాజకీయాలకతీతంగా, కులవతాలకతీతంగా, మతసామరస్యంతో, మానవత్వంతో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో అన్నదమ్ములుగా జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ) ఆల్ఫ్రైడ్,మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, వేమా రెడ్డి,యువరాజు, భాస్కర్, రత్నాకర్ చిన్నస్వామి ఆచారి, సుబ్బారావు, ముద్దపాటి ప్రసాద్, నంబర్ లక్ష్మన్న,రమేష్ రెడ్డి, జీవన్న, నాగేశ్వర్ నాయక్, జనసేన శేషు, మహానంది,జనార్ధన్ నాయక్, రాముడు, కుటుంబరావు,గోవిందయ్య ఆచారి, పక్కిరయ్య, నారాయణ, సుధాకర్, దూదేకుల హుస్సేన్, రామచంద్రుడు, ఆంథోనీ, కిరణ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

