Monday, March 16, 2026

మాగంటి సునీతమ్మకే మన ఓటు ప్రచారంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

నేటి సాక్షి, కోరుట్ల టౌన్* (గణేష్ గొల్లపల్లి)జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కారు గుర్తుకు ఓటు వేయాలని మంగళవారం ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ..జనసేవకే ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు.*వాగ్దానాలు కాదు – ఆచరణే బీఆర్‌ఎస్ పార్టీ అంటే* ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలలో ఒక్కటినీ నెరవేర్చలేదని, ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసిందని విమర్శించారు.ప్రజలకు అవగాహన కల్పించేందుకు “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేస్తూ, ప్రజలతో కాంగ్రెస్ వంచనల గురించి వివరిస్తూ,“వాగ్దానాలు కాదు – ఆచరణే బీఆర్‌ఎస్ పార్టీ నమ్మకం” అని,“తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని గుర్తుగా నిలిచిన బీఆర్‌ఎస్ పార్టీకి మీ మద్దతు మరోసారి చాటండి. రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించడానికి, ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడానికి,కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీత గోపినాథ్ భారీ మెజార్టీతో గెలిపించండి”అని పిలుపునిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News