Wednesday, March 18, 2026

*మాజీ ఎంపీ సురేష్ ఆసత్య మాటలు ఆపాలి** మీ మాటలు ను నమ్మి మోసపోయారు * ఇప్పుడు మరలా కొత్త డ్రామా ఇక నమ్మడానికి బాపట్ల జిల్లా ప్రజలు ఎవరూ లేరు* బాపట్ల పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని జీవన్

నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధివైసీపీ పార్టీ, నందిగామ సురేష్ మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం ఎవరూ లేరు అని బాపట్ల పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లెం సరోజిని జీవన్ అన్నారు. గతంలో కూడా అరటి తోటల దగ్ధం కేసులో సురేష్ అసత్య ఆరోపణలు చేసి సీటు సంపాదించుకొని డ్రామాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు , తన పార్లమెంటు పరిధిలో చట్టపు చూపుగా తప్పితే ఏనాడు ప్రజా సమస్యల పరిష్కరించిన దాఖలాలు లేవు. గతంలో జగన్తో ఫోటోలు ఫోజులు ఇవ్వడం తప్పితే, తన పార్లమెంటు పరిధిలోని ప్రజలకు, తన సొంత సామాజిక వర్గానికి కూడా ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తి నందిగామ సురేష్. ఇప్పుడు మరలా మాయమాటలు చెబుతూ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం, పోలీసు వ్యవస్థను తప్పు పట్టే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు, తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది, నా బిడ్డలు ఇలా అన్నారు, నా దగ్గర డ్రైవర్ల పని చేయడం లేదు అంటే సింపతి క్రియేట్ అవ్వదు, గత ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించలేదు???, కనీసం పరామర్శ అయినా చేసావా, గత ముఖ్యమంత్రి పక్కన నిన్ను పెట్టుకున్నట్లు ఏదో ఫోటోలు ఫోజులు ఇవ్వడం తప్పితే, నిన్ను గెలిపించిన బాపట్ల పార్లమెంటు పరిధిలో ప్రజల సమస్యల పైన, ఏం పనులు చేశారు మీరు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మాని, ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేస్తే కనీసం గుర్తింపు అన్నా ఉంటుంది. చేసిన పాపం కొంత అన్న పోతుంది, ప్రభుత్వం పైన,నాయకుల పైన,అధికారుల పైన అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని, దళితులను ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటున్న మనస్తత్వం వైసీపీ పార్టీకి చెందినదని బాపట్ల పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజినీ జీవన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News